కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే దోచుకుని, దాచుకున్నారు…

Delhi : Telangana Needs Special Status

వరంగల్ అర్బన్: ప్రగతి నివేదన సభ భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంగర కలాన్‌లో 25 లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రెండున్నర లక్షల మందిని తరలిస్తామని, ప్రజల అనూహ్య స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. 3380 వాహనాల్లో జనాన్ని తరలిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని వివరించారు. సభ ద్వారా నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే దోచుకుని, దాచుకున్నారని ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికలు అనగానే ప్రతిపక్షాలు ఆగమవుతున్నాయని ఎద్దేవా చేశారు.

Comments

comments