కస్తూరిబా పాఠశాల నుండి బాలిక అదృశ్యం

జ్యోతినగర్: ఎన్ టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కపల్లిలో గేటు సమీపంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి సౌఖ్య శ్రీ అనే బాలిక అదృశ్యమైనట్టు మంగళవారం ఎన్ టిపిసి ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. కస్తూరిభా పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సౌఖ్యశ్రీ మంగళవారం ఉదయం పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండానే వెళ్లి పోయిందని వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది మంచిర్యాలలో నివాసముంటున్న సౌఖ్యశ్రీ తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం అందించగా ఇంటికి చేరుకోలేదని సమాచారం ఇవ్వడంతో సమీప బంధువులకు […]


జ్యోతినగర్: ఎన్ టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కపల్లిలో గేటు సమీపంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి సౌఖ్య శ్రీ అనే బాలిక అదృశ్యమైనట్టు మంగళవారం ఎన్ టిపిసి ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. కస్తూరిభా పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సౌఖ్యశ్రీ మంగళవారం ఉదయం పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండానే వెళ్లి పోయిందని వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది మంచిర్యాలలో నివాసముంటున్న సౌఖ్యశ్రీ తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం అందించగా ఇంటికి చేరుకోలేదని సమాచారం ఇవ్వడంతో సమీప బంధువులకు కూడా ఫోను ద్వారా అడిగి తెలుసుకోగా ఎక్కడికి రాలేదని అన్నారు. దీంతో కస్తూరిభా పాఠశాలకు చెందిన వార్డెన్ రమ్యశ్రీ ఎన్ టిపిసి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ చంద్ర కుమార్ తెలిపారు.

Related Stories: