కష్టాల్లో టీమిండియా

ఓవెల్ : ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన వెంటవెంటనే ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) తొలి ఓవర్ లోనే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ధావన్ […]

ఓవెల్ : ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన వెంటవెంటనే ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) తొలి ఓవర్ లోనే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ధావన్ (21) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (5) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. కీలక ఆటగాళ్లు ధోని (4), యువరాజ్ (22) పరుగులకే వెనుదిరిగారు. యువ ఆటగాడు జావద్ (9) పరుగులకే క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఇండియా 18 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో పాండ్య (17), జడేజా (0) ఉన్నారు.

Related Stories: