కవితా కిరణాలుగా గజల్స్

Literary sector is a new consciousness

తెలంగాణా రాష్ట్రం అవతరించాక ఇక్కడి కవులలో ఒక నూతనోత్తేజం వచ్చింది. సాహిత్య రంగం ఒక కొత్త చైతన్యం సంతరించుకొంది. కవులంతా తమ సిద్ధాంత విభేదాలను కొంత కాలం పక్కకు పెట్టి లేక కొంత విస్తృతం చేసుకొని తెలంగాణా పురోగమనానికి తమను తాము దోహదం చేసుకొంటున్నారు. తమ వ్యక్తీకరణ లోని క్లిష్టత సడలించారు . అట్లాగే ఉద్యమం వేడి కూడా తగ్గిపోయి శీతల చైతన్య కిరణాలు విరుస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తన గజల్ , రుబాయిల రెక్కలతో ఆకాశ యానం చేస్తున్న కవయిత్రి గద్వాల కిరణ్ కుమారి.

గద్వాల కవిత్వం అప్పుడే రెక్కలు విచ్చుకొని ఎగిరే కపోతంలాగా స్వచ్ఛంగా ఉంటుంది .ఎలాంటి కృత్రిమ ప్రయోగాలు లేకుండా స్వేచ్ఛగా కూడా ఉంటుంది .ఆమె తన నిర్మలమైన హృదయానికి అనుగుణంగా గజల్ ప్రక్రియను స్వీకరించారు .తెలంగాణా సాహితీ లోకంలో మొదటి గజల్ కవయిత్రి గా నిలబడ్డారు. గజల్ ఏడవ శతాబ్ది లో అరేబియా లో జన్మించింది .ఇది పాటకు మరో రూపంగా కొనసాగింది. ఏడవ శతాబ్దంలో జీవించిన జమీల్ వల్ల గజల్ కి ఒక నిర్దిష్టత ఏర్పడింది

అరబిక్, పరిషియన్, తుర్కిష్, ఉర్దూ కవిత్వాలలో ఇది ప్రచలితమైంది .1389 లో జీవించిన హఫీజ్ (Hafez) పార్శి లో గజల్ రచనలో ప్రసిద్దుడు. గజల్ జర్మనీ రొమాంటిక్ పోయెట్రీ లో ప్రవేశించింది.ప్రైడ్రిగ్ ఐ సెగల్ (Friedrich Schiegel) గోతే (J.W.Ven Goethe) గజల్ ని ప్రచలితం చేసిన జర్మన్ కవులలో ప్రధానం గా పేర్కొనదగినవారు . ఆంగ్లంలో రాబర్ట్ (Robert) థామస్ హార్డీ ( Thamas Hardy) అంద్రుయ్ (Andrew) గజల్ రూపానుకరణం చేశారు. ఉర్దూలో గాలిబ్ ఉమర్లు గజల్ రచనలో సిద్ధహస్తులు.

పారశీక భాషలనుండి మన్నవి ,కసిదా, గజల్ రుబాయి లాంటి( తెలుగులో దే శీ చందానికి దగ్గరగా ఉన్నవి )ప్రక్రియలు పుట్టుకొచ్చాయి .గజల్ కొంతవరకు తెలుగు సీసమాలిక లాగా ఉంటుంది .గజల్ రాయనివాడు ఖమర్ త్రాగనివాడు ఫారసీ పేరు పెట్టుకోకండని సామెత ఉంది .అంటే కవుల వ్యక్తీకరణ కి అనుకూలమైన రూపం గజల్ .గజల్ లో సాధారణంగా ప్రియ విరహం ,వసంతం ,ద్రాక్షా సవం ,ఉద్యానవనం ,గులాబి ,బుల్బుల్ ,లాంటివి వర్ణిస్తారు . సూఫీ తత్వాన్ని మార్మికంగా వ్యక్తీకరిస్తారు. తెలుగుకు వచ్చేసరికి గజల్ పూర్తి గా సామాజికీకరణం పొందింది .

తెలుగులో దాశరథి సినారె నుండి తిరుమలాచార్య , ఏనుగు నరసింహారెడ్డి,పెన్నా శివ రామకృష్ణ ,మడిపల్లి రాజకుమార్ వరకు గజల్, రుబాయీలు రాస్తూనే ఉన్నారు. కిరణ్ కుమారి చాలా కాలంనుండి చాలా ప్రక్రియలు రాస్తూనే ఉన్నారు .పలు సభలలో వ్యాఖ్యాతగా అద్యక్షులు గా ఉండి సభలను అలరిస్తారు .ముక్త తెలంగాణా స్త్రీ సంఘంలో ఒక activistగా ఉన్నారు .చిత్రమేమిటంటే చాల మంది సంక్లిష్ట కవుల వరుసలోనే ఆమె కూడా భావ చిత్రాలు పేర్చుకుంటూ పోవాలి .అట్లా కాకుండా తన సమకాలీనులతో నడుస్తూనే తన కంటూ ఒక విలక్షణమైన ,ప్రత్యేకమైన మార్గాన్ని ఎన్నుకొన్నారు .ఆమార్గంలో ఆమె ఏ భావాన్నైనా అవలీలగా వ్యక్తం చేస్తున్నారు.అంతరించి పోయిన నిసర్గ జీవితం గురించి ఆమె ఆవేదన చూడండి.

“పక్షులకోసంతోటలు లేవు ఊ రిని తలచే మాటలు లేవు
నగర జీవితం జిలుగు వెలుగులే వెన్నెల పరచే దారులు లేవు”
ఈ వరకే చెప్పినట్టు ఈమె మహిళా సంఘం బాధ్యురాలు. అ బాధ్యతలతో పొటమరించిన ఆమె భావజాలం చూడండి .
“ఆమెను మనిషి లా మెచ్చి చూడు అవనిలో సగం ఇచ్చి చూడు
మేధస్సు తో కాలాన్ని గెలుస్తుంది కాస్త నమ్మకాన్ని ఇచ్చి చూడు
అసమానత కూలుతుంది కిరణా మనిషి గా అవకాశం ఇచ్చి చూడు”
చదువగానే హృదయానికి హత్తుకోవడం ఆమె కవిత్వ లక్షణం .వస్తువుని కప్పేసే అలంకారాల వల్ల ప్రయోజనం ఉండదు . ఈ విషయాన్ని రవీంద్ర నాథ్ టాగోర్ ఇట్లా ధ్వన్యాత్మకం గా చెబుతాడు .
The child who is decked with prince robes and who has jewelled chains round his neck loses all pleasure in his play his dress hampers him at every stage .
ఈ కవయిత్రి ఇప్పటికీ తన సొంతూరిని కల గంటూనే ఉంటుంది. దాటి వచ్చిన బాల్యం స్మృతులు ఆమెను వెంటాడుతూనే ఉంటాయి .అక్షరాలై కురుస్తుంటాయి .

ఇప్పటికి నా ఊరిని కలగంటాను ఇప్పటికి నా ఊరితో కలిసుంటాను
ఇంతవకు ప్రతి కవి రాస్తాడు ,అక్కడికే వదిలేస్తే ఆమె గద్వాల కిరణ్ ఎలా అవుతుంది ?
సమస్యల బావిలో నిరాశను గెలిచినపుడు గర్వంగా వెన్నును తడుతుంటాను.అని తన ప్రత్యేకతను చాటుకొంటారు.ఈ కవయిత్రి దుఃఖం నిరాశా వాదానికి మూలం కాదు .ఈ నిరసన నుండి ఈమె కొత్తను కోరుకొంటున్నారు .సామాజిక ప్రచలనాలన్నిటిలోను తన అస్తిత్వాన్ని కాపాడుకొంటునే తన వెన్ను తానే తట్టుకొంటూ నిరాశను గెలుస్తున్నారు .ఆమె అక్షర ప్రేమ ఆమెకు ఇలాంటి అపూర్వ శక్తినిచ్చింది. గజల్ రూబాయిల రచనలు రెంటిలోనూ చాలా మంది తెలుగు కవులు ఛందస్సును ప్రాయికంగా మాత్రమే అనుసరించారు .కాని ఈ కవయిత్రి ఛందస్సును చాలా నిర్దుష్టం గా పాటించింది . గజల్ లో మొదటి రెండు పాదాలను షేర్ అంటారు. గజల్ లోని మొదటి షేర్ ని మత్లా అంటారు .రెండు పదాల్లో చివర ఉన్న పదాన్ని రదీప్ అంటారు . రదీప్ కంటే ముందున్న పదం కాపీయా . గజల్ లో మత్లాలోని రెండు పాదాంతాల్లోను రదీప్,కాపీయా, పునరావ్రుతమౌతాయి .

ఇప్పటికి మా ఊరిని కలగంటాను నేను ఎప్పటికి నా బాల్యం తో కలిసుంటాను నేను పై మత్లలో నేను అనే పద౦ రదియ, దాని పై పదం కాపియ , అలాగే మిగతా షేర్ ల రెండో పదంలో ఈ రదియ, కాపీయ పునరావృతం కావాలి. ఇట్లా, గెలువాలంటే ఓపిక కావాలి కదా ఎవరినైనా తిష్టేసిన సోమరితనాన్ని నెడుతుంటాను నేను ఇట్లా 17 నుండి 25 పాదాలు కొనసాగాక చివరి ద్విపాదాన్ని ముక్త అంటారు .
ఇందులో కవి పేరు తో గాని కలం పేరు తో గాని సంబోధన ఉండాలి. నేటికీ స్నేహితులే నీకు బలం కిరణా స్నేహం కోసం మళ్ళీ పుడుతుంటాను నేను ఇక్కడ కవయిత్రి కిరణా అని సంబోధించుకుంది. దీన్ని తఖల్లుస్ అంటారు . ఇది ప్రక్రియల మీద ఆమెకున్న పట్టును తెలియజేస్తుంది.

కిరణ్ తెలుగు విశ్వవిద్యాలయంలో నా సహాధ్యాయి. కొల్లాపురం విమల, ఏనుగు నరసింహ రెడ్డి ,బాణాల శ్రీనివాస్ ,అంకం మనోహర్ ,చందు పట్ల అంబ దాస్ ,మన్నం చంద్ర మౌళి ,నందమూరి లక్ష్మి పార్వతి , శ్రవణ్ మొద లైన వాళ్లంతా తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యయన సహచరులే . వీరిలో ఎవరిని కలిసినా రక్తసంబంధీకులను కలిసినంత పులకరింత కలుగుతుంది . ఆనాడు పొందిన సాహిత్యానుభూతులు గుర్తొస్తాయి . ఇప్పుడు ఇందులో దాదాపుగా అందరూ సాహిత్య రంగం లో కొనసాగుతున్నారు . కిరణ్ కూడా సాహిత్య రంగంలో అడుగులు వేస్తూ , తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంతరించు కోవడం సంతోషించ దగిన పరిణామం. ఇలాంటి యాది నుండే పొటమరించిన ఆమె గజల్ చూడండి. తేనె మాటల నురగలు సెలయేటి పరుగులు మధురమైన జ్ఞాపకాల విందు కదా బాల్యం విశ్వవిద్యాలయ అధ్యయన జీవితం బాల్యమేం కాకపోయినా పసితనపు నైర్మల్యమే అందరిలోనూ ఉంది. చిరు చిరు అలకలను చింతలను మానుకొని ఆకాశాన్ని ప్రేమించే పక్షి లాగా ఎగరడం, మదిలోని మాటలకూ తీపిని అద్దుకొని ,హరివిల్లును తీసుకొచ్చే వానలాగా కురవడం ఆమె కవితా లక్ష్యం .
తెలంగాణా మొదటి గజల్ కవయిత్రిని ఆత్మ గుణంతో అభినందిస్తున్నా . ఆమె కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నా.
      – డాక్టర్ కాంచనపల్లి, లాస్ ఏంజెల్స్(అమెరికా)
kaanchanapalliraju@gmail.com

Comments

comments