కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడబిడ్డల్లో ఆనందం

మండల పరిషత్ సమావేశ మందిర నిర్మాణ పనులను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి  మన తెలంగాణ/కీసర : కీసరలో రూ.92.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మండల పరిషత్ నూతన సమావేశ మందిర నిర్మాణ పనులను గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ […]

మండల పరిషత్ సమావేశ మందిర నిర్మాణ పనులను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి 

మన తెలంగాణ/కీసర : కీసరలో రూ.92.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మండల పరిషత్ నూతన సమావేశ మందిర నిర్మాణ పనులను గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ పెళ్లి కన్నవారికి భారం కాకుడదన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలు పేద యువతుల జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్ధిక సాయంతో ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. మొదట రూ.51 వేలుగా ఇచ్చిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఆర్ధిక సాయాన్ని ప్రజల నుంచి వచ్చిన స్పందనతో రూ.75,116 పెంచి మళ్లీ రూ.1,00,116కు పెంచడం శుభ పరిణామ మని అన్నారు. కేసీఆర్ నాయక త్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన సమావేశ మందిర నిర్మాణం చేపట్టడం అభినందనీ యమని అన్నారు. త్వరితగతిన సమావేశ మందిర నిర్మాణం పూర్తి చేయాలని గుత్తెదా రును ఆదేశించారు.  ఎంపీపీ ఆర్.సుజాత, వైస్ ఎంపీపీ ఎం.స్వప్న, జడ్పీటీసీ బి.రమాదేవి, తహసీల్దార్ నాగ రాజు,  ఎంపీడీఓ కె.వినయ్ కుమార్, మండ ల ఎఇ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Related Stories: