కల్వర్టును ఢీకొన్న జీపు: ముగ్గురి మృతి

Two died in road accident at jagtial

ధర్మాపూర్: మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును జీపు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. కర్నాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్నాటక లోని రాయచూర్ జిల్లా ముదగల్ కు చెందిన వారుగా గుర్తించారు.