కల్యాణ లక్ష్మి పేదలకు వరం : గాదరి కిషోర్

మనతెలంగాణ/అర్వపల్లి:పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ వరం లాంటిదని తుంగతుర్తి ఎం.ఎల్.ఎ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని కళ్యాణ లక్ష్మీ 46  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు అవసరమయ్యే విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై భారం పడవద్ధని , ఆడపిల్ల పుట్టగానే చంపకుండా కే.సి.ఆర్ కిట్‌తో ఆడపిల్లలకు భరోసాగా నిల్చిందని దాని ద్వారా ఆడపిల్ల పుడితే 13000, […]

మనతెలంగాణ/అర్వపల్లి:పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ వరం లాంటిదని తుంగతుర్తి ఎం.ఎల్.ఎ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని కళ్యాణ లక్ష్మీ 46  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు అవసరమయ్యే విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై భారం పడవద్ధని , ఆడపిల్ల పుట్టగానే చంపకుండా కే.సి.ఆర్ కిట్‌తో ఆడపిల్లలకు భరోసాగా నిల్చిందని దాని ద్వారా ఆడపిల్ల పుడితే 13000, మగపిల్లవాడు పుడితే 12000 దీనితో పాటు 15 వస్తువులు అందించి కళ్యాణం సమయంలో ఆడపిల్లలకోసం కళ్యాణలక్ష్మీ,శాదీముబారక్ ద్వారా డబ్బులు ఇస్తున్నట్లు వారన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణరాష్ట్ర ప్రభుత్వమేనని వారన్నారు. రైతుల కోసం అన్ని విధాలుగా, అన్నిగ్రామాలు, అన్నికులాలు, గౌరవించే ఏకైక వ్యక్తి సి.ఎం కేసి.ఆర్ అని వారన్నారు. ఈ కార్యక్రంలో ఎం.పి.పి దావుల మనీషావీరప్రసాద్, తహసీల్దార్ పులిసైదులు, ఎం.పి.టి.ఓ బి. శిరీష, టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు కుంట్ల సురేందర్ రెడ్డి, టి.ఆర్.ఎస్ నాయకులు దావుల వీరప్రసాద్‌యాదవ్ తదితరులు పాల్గోన్నారు.. దేవాలయ చైర్మన్ బొడ్డురామలింగయ్య, రైతు సమన్వయ కో ఆర్డినేటర్‌పి.నర్సయ్య, మొరిశెట్టి ఉపేందర్,సర్పంచ్‌లు జీడి వీరస్వావమి, లక్ష్మినర్సుయాదవ్,సోమేష్,రామలింగయ్య తదితరులున్నారు.

Comments

comments

Related Stories: