కలెక్టర్‌కు బంగారు పతకం

gold medal collector Shweta mahanthi

ఆగష్టు 10న హైద్రాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోనున్న కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/వనపర్తి : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఉత్తమ సేవలందించినందుకు గాను 2016-17 సంవత్సరానికి ఇచ్చే బంగారు పతకానికి కలెక్టర్ శ్వేతామహంతి ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ నుండి కలెక్టర్‌కు సమాచారం అందింది. ఆగష్టు 10న హైద్రాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఈ బంగారు పతకాన్ని స్వీకరించనున్నారు. కలెక్టర్‌కు బంగారు పతకం రావడం పట్ల ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఖాజాకుతుబుద్దిన్, అమర్. అధికారులు, ఉద్యోగ సంఘాలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ శ్వేతామహంతికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

comments