కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం!

రాజన్న సిరిసిల్ల: జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భూమిని అక్రమంగా వార్డు కౌన్సిలర్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని సువర్ణ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడ ఉన్నవారు గమనించి ఆమెను అడ్డుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Stories: