కలిసి ప్రమోషన్ చేస్తారట

Samantha Akkineni U-Turn to release on September 13

టాలీవుడ్‌లో ఉన్న క్యూట్ కపుల్స్‌లో నాగచైతన్య, సమంత జంట ఒకటి. కెరీర్ ప్రారంభంలో వీళ్లిద్దరూ కలిసి ఏ మాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరూ వైవాహిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చైతన్య, సమంత నటించిన రెండు వేర్వేరు సినిమాలు ఈనెల 13న బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. అయితే తమ సినిమాలకు కలిసి ప్రమోషన్ చేస్తామని అంటున్నారు నాగచైతన్య, సమంత. నిజానికి సమంత సినిమా ‘యు టర్న్’ను ఈనెల 13న విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు ఫిల్మ్‌మేకర్స్. అయితే నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదాపడి చివరికి ఈనెల 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసినప్పుడు సమంత స్పందన ఏమిటని చైతన్యను అడిగితే… “తొలిసారి సోలో హీరోయిన్‌గా ‘యు టర్న్’ సినిమా చేశాను. అది రిలీజవుతుంటే నువ్వు వచ్చి నా మీద పడతావా?… అంటూ దెయ్యంలా మొహం పెట్టింది”అని అతను పేర్కొన్నాడు. ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు డిఫరెంట్ జోనర్‌లలో వస్తున్న యు టర్న్, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని డిస్ట్రిబ్యూటర్లు ధైర్యం చెప్పారట.

Comments

comments