కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి

మనతెలంగాణ / లింగంపేట: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ జంపర్ వైర్ సరి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ట్రాన్స్‌ఫార్మర్ పైనే యువరైతు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి శివారులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పోతాయిపల్లి గ్రామానికి చెందిన సొనబోయిన అంజయ్య(35) అనే రైతు శనివారం తన పంట పొలానికి నీరు పారించడానికి వెళ్లాడు. విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయగా మోటార్ ఆన్ కాలేదు. దాంతో […]

మనతెలంగాణ / లింగంపేట: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ జంపర్ వైర్ సరి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ట్రాన్స్‌ఫార్మర్ పైనే యువరైతు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి శివారులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పోతాయిపల్లి గ్రామానికి చెందిన సొనబోయిన అంజయ్య(35) అనే రైతు శనివారం తన పంట పొలానికి నీరు పారించడానికి వెళ్లాడు. విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయగా మోటార్ ఆన్ కాలేదు. దాంతో అంజయ్య పంట పొలం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్జ్ పీజు వైరు కాలిపోయింది. దాంతో అంజయ్య కరెంట్ సరఫరా నిలిపివేసి  ట్రాన్స్ పార్మర్ పైకి ఎక్కి  పీజు వైర్లను  సరిచేస్తుండగా  కరెంట్ సరఫరా  జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని  గ్రామస్థులు ,కుటుంబ సభ్యులు తెలిపారు.  మృతుడు ట్రాన్స్‌ఫార్మర్ పైనే చిక్కుకుని  ప్రాణాలు వదిలాడు.  మృతుడికి బార్య అనుసూయ, అఖిల్, రాజు, రవి అనే ముగ్గురు కుమారులు  ఉన్నారు.  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి భార్య పిల్లల రోదనలు  పలువురిని కంట తడిపెట్టించాయి. స్థానిక  ఏఎస్‌ఐ రాజేశ్వర్   సంఘటన స్థలానికి చేరుకుని  పంచనామా  నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపడుతున్నట్లు   ఏఎస్‌ఐ తెలిపారు.

Related Stories: