కరుణ ఆత్మకు శాంతి చేకూరాలి : మోడీ

PM Modi's condolences over Karunanidhi's death

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి మృతిపై భారత ప్రధాన నరేంద్ర మోడీ తన ట్వీట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయనకు అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. భారత దేశం ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కరుణానిధిని కోల్పోయిందన్నారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే కరుణ మరణవార్త తెలియగానే డిఎంకె నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరు శోకసంద్రంలో మునిగిపోయారు తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.