కరుణానిధి మృతి పార్టీకి తీరని లోటు : స్టాలిన్

DMK Executive Committee Meeting Held in Chennai

చెన్నయ్ : డిఎంకె గొప్ప నేతను కోల్పోయిందని, కరుణానిధి మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చెన్నయ్‌లో డిఎంకె కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. కరుణానిధి మృతిపై సమావేశంలో సంతాప తీర్మానం చేశారు. డిఎంకె అధ్యక్ష పదవికి స్టాలిన్ ఎంపికపై చర్చించారు. డిఎంకె అధ్యక్ష పదవి కోసం స్టాలిన్‌తో పాటు ఆళగిరి కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో డిఎంకెలో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

DMK Executive Committee Meeting Held in Chennai

Comments

comments