కరుణానిధి మృతిపై పార్లమెంట్ నివాళి

ఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులు అర్పించాయి. ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కరుణానిధి మృతిపై తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య, లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు చదివి వినిపించారు. అయితే కరుణానిధి ఇప్పటి వరకు రాజ్యసభకు, లోక్‌సభకు ఎంపిక కాలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్ ఉభయసభలు కరుణాధికి నివాళులు అర్పించడం ఇదే మొదటి […]

ఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులు అర్పించాయి. ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కరుణానిధి మృతిపై తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య, లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు చదివి వినిపించారు. అయితే కరుణానిధి ఇప్పటి వరకు రాజ్యసభకు, లోక్‌సభకు ఎంపిక కాలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్ ఉభయసభలు కరుణాధికి నివాళులు అర్పించడం ఇదే మొదటి సారి. కరుణానిధికి నివాళులు అర్పించిన అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను గురువారం నాటికి వాయిదా వేశారు.

Parliament Adjourns In Tribute To Karunanidhi

Comments

comments

Related Stories: