కరుణానిధి మరణం తీరని లోటు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత   కరుణానిధి మృతి పట్ల  సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మరణం తీరని లోటు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా,భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారని ఆయన అన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన నాయకుడు కరుణానిధి అని సిఎం  కెసిఆర్ అన్నారు. కాగా, కరుణానిధి […]

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత   కరుణానిధి మృతి పట్ల  సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మరణం తీరని లోటు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా,భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారని ఆయన అన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన నాయకుడు కరుణానిధి అని సిఎం  కెసిఆర్ అన్నారు. కాగా, కరుణానిధి అంత్యక్రియలు బుధవారం జరగనున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ రేపు చెన్నై వెళ్లి అంత్యక్రియల్లో  పాల్గొననున్నారు.

Related Stories: