కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై ఆయన పార్థివదేహాన్నిమోస్తూ… అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నకరుణ అభిమానుల హృదయాలు బరువెక్కాయి. కరుణనిధిని చూసేందుకు ప్రజలు రహదారుల వెంట భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. తమ ప్రియతమ నాయకుడ్ని కడసారి చూసేందుకు ప్రజలు, డిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల […]

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై ఆయన పార్థివదేహాన్నిమోస్తూ… అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నకరుణ అభిమానుల హృదయాలు బరువెక్కాయి. కరుణనిధిని చూసేందుకు ప్రజలు రహదారుల వెంట భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. తమ ప్రియతమ నాయకుడ్ని కడసారి చూసేందుకు ప్రజలు, డిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు చేరుకుంటుంది. 5 గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. మెరీనా బీచ్‌లో ఇప్పటికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 

Related Stories: