కరుణానిధిని పరామర్శించిన ఉప రాష్ట్రపతి

Venkaiah-naidu-and-Karunani

తమిళనాడు: చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో డిఎంకె అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని స్టాలిన్, కనిమొళిని అడిగి తెలుసుకున్నారు. వెంకయ్యతో పాటు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆస్పత్రికి వచ్చారు. రెండు రోజుల క్రితం మూత్రకోశ నాళంలో ఏర్పడిన ఇన్‌ఫెక్షన్ వల్ల జ్వరంతో బాధపడుతున్న  కరుణానిధిని ఇంటి నుంచి కావేరీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 94 ఏళ్ల కరుణానిధిని ఆసుపత్రిలో ని ఐసియులో చికిత్స పొందుతున్నారు. బిపి స్థాయి పడిపోవడంతో ఆయనని ఆసుపత్రికి తరలించామని డిఎంకె వర్గాలు  ప్రకటించాయి.

Comments

comments