కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి

చెన్నయ్ : డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ సిఎం దివంగత  కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డిఎంకె నేతలు డిమాండ్ చేశారు. డిఎంకె సర్వసభ్య సమావేశం గురువారం హోసూరులో జరిగింది. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసింది. తళి ఎంఎల్‌ఎ ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా కరుణానిధికి నివాళలు అర్పించారు. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డిఎంకె సమావేశంలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని ప్రకాశ్ తెలిపారు. భారతరత్నకు కరుణానిధి అన్ని […]

చెన్నయ్ : డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ సిఎం దివంగత  కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డిఎంకె నేతలు డిమాండ్ చేశారు. డిఎంకె సర్వసభ్య సమావేశం గురువారం హోసూరులో జరిగింది. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసింది. తళి ఎంఎల్‌ఎ ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా కరుణానిధికి నివాళలు అర్పించారు. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డిఎంకె సమావేశంలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని ప్రకాశ్ తెలిపారు. భారతరత్నకు కరుణానిధి అన్ని విధాల అర్హుడని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో కరుణానిధి ఇటీవల మృతి చెందిన విషయం విదితమే.

DMK Wants Bharat Ratna for Karunanidhi

Related Stories: