కరీంనగర్ కు స్మార్ట్ లుక్

 Karimnagar Smart City project

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరానికి స్మార్ట్ లుక్‌లు తీసుకొస్తామని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో నడి ఒడ్డున ఉన్న మల్టీపర్పస్ స్కూల్ గ్రౌండ్ సందర్శించారు. ఎంపి,నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, మున్సిపల్ కమీషనర్ కె. శశాంకతో కలిసి పార్కుకోసం అభివృద్ధి చేస్తున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పార్కు ఏర్పాటు చేయనున్న అతిపెద్ద జాతీయ జెండా కోసం స్థల పరిశీలన చేశారు.పార్కు డిజైనింగ్ మ్యాప్‌ను పరిశీలించిన ఎంపి వినోద్ కుమార్ అధికారులకు సలహాలు, సూ చనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు మ్యాప్‌ను పరిశీలించి కమీషనర్ శశాంక,మేయర్ రవీందర్ సింగ్‌లతో పలు అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ ప నులు ప్రారంభమయ్యాయనిఅందులో భాగంగానే నగరంలో టవర్ సర్కిల్, మ ల్టీపర్సస్ గ్రౌండ్, స్మార్ట్ రోడ్లను మొదటి దశలోనే అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోని ప్ర ధానంగా మల్టీపర్పస్ గ్రౌండ్‌ను అందమైన పార్కుగా మార్చేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు.మరి కొ ద్ది రోజుల్లో టవర్ సర్కిల్ పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలోని స్మార్ట్ రోడ్లకు టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. త్వరలోనే స్మార్ట్ రోడ్ల పనులు ప్రారంభమైతామని తెలిపారు.మల్టీపర్పస్ గ్రౌండ్‌ను నగరం నడి ఒడ్డున ఒక అందమైన ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ది చేయ డం జరుగుతుందన్నారు. ప్రధానంగా పార్కులో అతి పెద్ద జాతీయ జె ండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకుగాను నేడు స్థలపరిశీలన చేసి జెండా ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.  ముఖ్యంగా మల్లీపర్పస్ గ్రౌండ్ పార్కు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కన్సెల్టెన్సీ బృందానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ కార్పోరేటర్ సునీల్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు మైఖెల్  శ్రీనివాస్, రాములు,అధికారులు,డిఇ యాదగిరి,ఏఇ చైతన్య తదితరులు పాల్గొన్నారు.