కప్పే లక్ష్యంగా కంగారులు

మన తెలంగాణ/ క్రీడా విభాగం : ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై విశ్లేషకులు సైతం అంచన వేయలేక పోతున్నారు. ప్రపంచంలోని 8 అగ్రశ్రేణి జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ అగ్రశ్రేణి టోర్నమెంట్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. దీంతో ఫలానా జట్టే గెలుస్తుందనే చెప్పేందుకు వీలు లేదు. ఒకప్పుడూ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లను ఫేవరెట్లుగా ప్రకటించేందుకు ఎవరు వెనుకాడే వారు కాదు. అయితే కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జోరు తగ్గింది. భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ క్రికెట్‌లో మెరుగైన ఆటతో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను ఏలిన వెస్టిండీస్ ఈసారి కనీసం టోర్నమెంట్‌కు అర్హత కూడా సాధించలేక పోయింది. అయితే బంగ్లాదేశ్ నిలకడైన ఆటతో వెస్టిండీస్‌ను సైతం వెనక్కి నెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్‌ను దక్కించుకుంది.

Team-Australia

ఆస్ట్రేలియాకే ఛాన్స్…
వన్డే క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న ఆస్ట్రేలియా ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ప్రపంచంలోనే విధ్వంసక బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా పేరొందిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు కీలకంగా మారాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన వార్నర్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. తనదైన రోజు ఎంత బౌలర్‌కైన చుక్కలు చూపించే సత్తా ఒక్క వార్నర్‌కే ఉంది. అతను చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టం. యువ సంచలనం క్రిస్ లిన్ కూడా కళ్లు చెదిరే ఇన్నిం గ్స్‌లు ఆడడంలో దిట్ట. అతను ఒకసారి క్రీజులో నిలదొక్కుకుంటే బౌలర్లు చేతులెత్తేయక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా లిన్‌కు ఉంది. ఐపిఎల్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నా డు. ఇక, మాక్స్‌వెల్, అరొన్ ఫించ్‌లను కూడా తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించిన వీరిద్దరూ ఈ టోర్నీలో కూడా మెరుగ్గా ఆడాలనే లక్షంతో ఉన్నారు. ఐపిఎల్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా ఉన్న మాక్స్‌వెల్ ఇటు బ్యాట్‌తో అటు బంతితో సత్తా చాటాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఫించ్ కూడా మెరు గ్గా రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కెప్టెన్ స్మిత్‌కు కూడా వన్డేల్లో అద్భుత రికార్డు ఉంది. ఐపిఎల్‌లో రాణించిన స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో జట్టును ముందుండి నడిపించేం దకు సిద్ధమయ్యాడు. ఎటువంటి బౌ లింగ్ లైనప్‌నైన చిన్నాభిన్నం చేసే స త్తా స్మిత్‌కు ఉంది. వికెట్ కీపర్ మా థ్యూ వేడ్, జాన్ హాస్టింగ్స్‌లు కూడా బ్యాటింగ్‌లో రాణించే సత్తా కలిగిన వారే.
తిరుగులేని స్పీడ్ దళం…
ఇక, ఆస్ట్రేలియాకు పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లుగా పేరొందిన స్టార్క్, పాటిన్సన్, కమిన్స్, హాజిల్‌వుడ్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. స్టార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అద్భుత ఫాస్ట్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు పలు మ్యాచుల్లో విజయం సాధించాడు. కమిన్స్, పాటిన్సన్, హాజిల్‌వుడ్‌లు కూడా ప్రతిభావంతులైన ఫాస్ట్ బౌలర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించాలనే పట్టులతో ఉన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీరిని ఎదుర్కొవడం ప్రత్యర్థి జట్లకు అంత సులువుకాదనే చెప్పాలి. మరోవైపు ఆడమ్ జంపా, హెన్రిక్స్, మార్కొస్ స్టోనిస్‌లు కూడా బంతితో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. సమష్టి పోరాటంతోఛాంపియన్స్ ట్రోఫీలో ముందుకు సాగాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో మెరుగ్గా రాణించడం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.

Comments

comments