కన్న తండ్రే కీచకుడిగా మారి..

మన తెలంగాణ /రంగారెడ్డి/శంషాబాద్ రూరల్ : కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ఓ తండ్రి ఆ బిడ్డల పాలిట కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని మైనర్ బాలికలపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ చివరికి కటకటాల పాలయ్యాడు. తీవ్ర సంచలనం రేపిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జీఐఎ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. నిందితుడు రాజ్‌బహదూర్ (55) ను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు. నేపాల్ దేశానికి చెందిన […]

మన తెలంగాణ /రంగారెడ్డి/శంషాబాద్ రూరల్ : కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ఓ తండ్రి ఆ బిడ్డల పాలిట కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని మైనర్ బాలికలపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ చివరికి కటకటాల పాలయ్యాడు. తీవ్ర సంచలనం రేపిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జీఐఎ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. నిందితుడు రాజ్‌బహదూర్ (55) ను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు. నేపాల్ దేశానికి చెందిన రాజ్‌బహదూర్ అనేక సంవత్సరాల క్రితం బీహార్ రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. అతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

కాగా పీకలదాకా మద్యం తాగే అలవాటు ఉన్న ఆ దుర్మార్గుడు తాగిన మైకంలో కన్న బిడ్డలపై అత్యాచారానికి పాల్పడేవాడు. అతని వికృత చేష్టలు అసభ్య ప్రవర్తన విషయాన్ని ఆ బిడ్డలు తల్లికి చెప్పారు. దీంతో ఆమె అతన్ని స్వస్థలానికి పంపించింది. మారిపోయానని చెప్పి నాలుగు నెలల క్రితం శంషాబాద్ వచ్చాడు. కాని అతని వక్రబుద్ది మారలేదు. దీంతో అతని భార్య ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

Comments

comments