కన్నడ నటితో చాహల్ పెళ్లి…?

బెంగళూరు: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కన్నడ నటి తనిష్కా కపూర్‌తో చాహల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడమేనని తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరూ జంటగా పలు ఈవెంట్లకు కూడా వెళ్లారట. ఐపిఎల్ పదకొండో సీజన్‌లో చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ […]

బెంగళూరు: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కన్నడ నటి తనిష్కా కపూర్‌తో చాహల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడమేనని తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరూ జంటగా పలు ఈవెంట్లకు కూడా వెళ్లారట. ఐపిఎల్ పదకొండో సీజన్‌లో చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ ఐపిఎల్ సీజన్ ముగిసిన వెంటనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని సమాచారం. అయితే వారి వివాహంపై వీరిద్దరి నుంచి కానీ, వారి ఫ్యామిలీల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

Related Stories: