కనువిందుగా కుంటాల

ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం, పరవళ్లు కట్టిపడేస్తున్న ప్రకృతి అందాలు  మన తెలంగాణ/నేరడిగొండ: దట్టమైన అటవీప్రాతంలో సహజసిద్ధంగా ఏర్పాడిన కుంటాల జలపాతం  గల గల పారేసెలయేళ్లు.. జలజల పారే అందమైన రెండు జలపాతాలు.. అద్బుతమైన అడవులు, కొండకోనలు.. పచ్చని ప్రకృతి… కనువిందు చేసే  కుంటాల జలపా తం  అందాలకు పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 60 కీలో మీటర్లు ఉంటుంది. నిర్మల్ […]

ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం
ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం, పరవళ్లు
కట్టిపడేస్తున్న ప్రకృతి అందాలు 

మన తెలంగాణ/నేరడిగొండ: దట్టమైన అటవీప్రాతంలో సహజసిద్ధంగా ఏర్పాడిన కుంటాల జలపాతం  గల గల పారేసెలయేళ్లు.. జలజల పారే అందమైన రెండు జలపాతాలు.. అద్బుతమైన అడవులు, కొండకోనలు.. పచ్చని ప్రకృతి… కనువిందు చేసే  కుంటాల జలపా తం  అందాలకు పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 60 కీలో మీటర్లు ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి 40 కీలో మీటర్ల దూ రంలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో కుంటాల జలపాతం మరింత శోభను సంతరించుకుంది. రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యం గా సెలవు రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వచ్చి ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే కుంటా ల జలపాతం కడెం నదిపై ఉన్న కుంటాల జలపాతం వద్ద 42 ఆడుగుల  ఎత్తు నుంచి సెలయేళ్లు  నయాగరా జలపాతంగా ఆకట్టుకుంటోంది. జలపాతం అందాలు 7 నెలలు కనువిందు చేస్తుంది. సహజసిద్ధ ్ద జలపాత సోయగాలను చూసేందుకు రా..రామ్మని పిలుస్తోంది.

Related Stories: