కనికరించని రెవెన్యూ సిబ్బంది

తహసీల్దార్, మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అగచాట్లు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతే ఆలస్యానికి కారణం మన తెలంగాణ/మణుగూరు రూరల్ : విద్యార్థులకు స్థానిక తంటాలు తప్పటం లేదు. నేటివిటీ సర్టిఫికెట్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కావాలంటే స్వస్థలానికి సంబంధించిన (నేటివిటీ సర్టిఫికెట్) ధృవీకరణ పత్రంతో పాటు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం విధించిన ఆంక్షలతో విద్యార్థులు […]

తహసీల్దార్, మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు
కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అగచాట్లు
తహసీల్దార్ కార్యాలయంలో అవినీతే ఆలస్యానికి కారణం

మన తెలంగాణ/మణుగూరు రూరల్ : విద్యార్థులకు స్థానిక తంటాలు తప్పటం లేదు. నేటివిటీ సర్టిఫికెట్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కావాలంటే స్వస్థలానికి సంబంధించిన (నేటివిటీ సర్టిఫికెట్) ధృవీకరణ పత్రంతో పాటు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం విధించిన ఆంక్షలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తక్కువ సమయంలో ఇచ్చిన ఆదేశాలతో అర్హత లభిస్తుందో లేదోనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ప్రతి విద్యార్థి స్వస్థలానికి సంబందించి స్థానిక సర్టిఫికెట్ ఒకటి కళాశాలలో అందజేయాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఆన్‌లైన్ సేవలు వచ్చాక పారదర్శకత పెరిగింది. కాని ఆన్‌లైన్ సేవల వెనుక అవినీతి లేకపోలేదు. రెవెన్యూ వాఖలో ధ్రువపత్రం కావాలన్నా, పట్టాపాసుపుస్తకం జారీ చేయాలన్నా చేయి తడపాల్సిందే..! ప్రత్యేకించి ఇప్పుడు వీరి టార్గెట్ విద్యార్థులే. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని,విద్యార్థులు పై చదువుల నిమిత్తం కుల, ఆధాయ, నివాస(స్థానిక) ధృవీకరణపత్రాలు కళాశాలలో అందజేయాల్సి ఉంటుంది. వీటి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు ఫారాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయా ఏరియాల వారీగా నియమించబడ్డ వీఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మీ సేవకు వెళ్లి మీ సర్టిఫికెట్ తీసుకెళ్లండి అంటూ వీఆర్వో బదులిస్తాడు. తర్వాత వీఆర్వో చెప్పిన సమయానికి మీసేవ కేంద్రానికి వెళితే అక్కడ ఇంకా మీ సర్టిఫికెట్ రాలేదు అంటూ జవాబుస్తాడు మీ సేవ కేంద్ర నిర్వాహకుడు. మండల పరిధిలోని రామానుజవరం, సాంబాయిగూడెం, పగిడేరు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజు మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న సమాధానం మాత్రం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నిర్వహిస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల ధృవీకరణలో దస్త్రాలు కదిలించేందుకు వీఆర్వోల ద్వారా జరుగుతున్న అవినీతి ఏమాత్రం తగ్గడం లేదని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు బాహాటంగానే చెప్పుకోవడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు సకాలంలో కుల, ఆధాయ, నివాస ధృవీకరణ పత్రాలు అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: