కదంబ మొక్క నాటనున్న సిఎం…

Haritha Haram program will be launched by CM KCR on Siddipet District

హైదరాబాద్: నాలుగో విడత హరితహారం కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్నిసిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. గజ్వేల్‌లో మార్కెట్ దగ్గర కెసిఆర్ కదంబ మొక్కను నాటబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు లక్షా 116 మొక్కలు నాటడానికి ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. హరితహారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని సిఎం పిలుపునిచ్చారు. 1400 మంది అధికారులు, 11 వేల మంది కార్మికులు పనిచేశారని పేర్కొన్నారు.