కథా రచయిత రాంబాబు కన్నుమూత

Story Writer Rambabu Passed Away

హైదరాబాద్ : ప్రముఖ కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు వేదగిరి రాంబాబు (66) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన డయాబెటిక్ న్యూరోపతి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయరు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సుధీర్ఘ కాలం ఆయన జర్నలిస్టుగా పని చేశారు. కథా రచయితగా, టెలివిజన్ సీరియల్ రచయితగా ఆయన పని చేశారు. ఆయన రాసిన 400కు పైగా కథానికలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తదితర రచయితల సాహిత్యాన్ని పునః ప్రచురణకు రాంబాబు విశేష కృషి చేశారు. ఆయన రాసిన అనేక రచనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Story Writer Rambabu Passed Away

Comments

comments