కథా రచయిత పెద్దిభొట్ల కన్నుమూత…

Pedhabotla

అమరావతి: విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దభొట్ల సుబ్బరామయ్య(79) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రయివేటు దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తనువుచాలించారు. 1938 డిసెంబర్ 15న గుంటూరులో పెద్దిభొట్ల జన్మించారు. ఒంగోలులో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నారు. విజయవాడలో పై చదువులు చదివారు. 350కి పైగా కథలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి ఆయన ఎనలేని సేవలందించారు. పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని గుంటూరు ఎన్నారై వైద్యశాలకు ధానం చేశారు.  పెద్దిభొట్లకు పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం, ఎస్ రన్నర్, వీళ్ళావంటి కథలు, ముక్తి, చేదుమాత్ర నవలలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆంధ్రా లయోలా కాలేజీలో 40 సంవత్సరాల పాటు లెక్చరర్ గా సేవలందించి ఆయన 1996లో పదవి విరమణ చేశారు. విఖ్యాత రతయిత ‘వేయి పడగలు’ నవల సృష్టికర్త విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడైన ఆయన లిఖించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలకు గానూ 2012 లో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. ఆయన మృతిపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, పలువురు సాహితీ వేత్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.