కత్తులతో బెదిరించి…రూ.3 లక్షలు అపహరణ

Thugs Theft 2.5 Lakhs by Knife

అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతం సూర్యోదయ కాలనీలో శనివారం తెల్లవారుజామున దారి దోపిడీ జరిగింది. దుండగులు కారును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. కారులో యాసిన్‌భాషా అనే వ్యక్తిని దుండగులు కత్తులతో బెదిరించి రూ.1.50 లక్షలు, 1500 యుఎస్ డాలర్లు (లక్ష రూపాయలు), థాయిలాండ్ కరెన్సీని (యాబై వేల రూపాయలు) అపహరించారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments