కత్తి మహేష్ పై దాడి!

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గురువారం కొండాపూర్ లోని ఓ ప్రాంతంలో కారు నుండి దిగుతుండగా కత్తి మహేష్ పై కొందరు దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ విషయమై పలువురు దళిత నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో బంద్ నిర్వహిస్తామని ఓయు జెఎసి ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో పవన్ కల్యాణ్ సినిమాలను బహిష్కరిస్తామని జెఎసి […]

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గురువారం కొండాపూర్ లోని ఓ ప్రాంతంలో కారు నుండి దిగుతుండగా కత్తి మహేష్ పై కొందరు దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ విషయమై పలువురు దళిత నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో బంద్ నిర్వహిస్తామని ఓయు జెఎసి ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో పవన్ కల్యాణ్ సినిమాలను బహిష్కరిస్తామని జెఎసి నేత వరంగల్ రవి పేర్కొన్నారు.
కత్తి మహేష్ సినిమా విమర్శలు చేయడం తప్పా?అంటూ ప్రశ్నించారు. కత్తి మహేష్ పై దాడులకు పాల్పడవద్దంటూ పవన్ కల్యాణ్ తన అభిమానులను ట్విట్టర్ ద్వారా ప్రకటించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లో పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని హెచ్చరించారు.

Pawan Kalyan Fans Attacked On Critic Writer Kathi Mahesh

Comments

comments

Related Stories: