కత్తిపై క్రిమినల్ కేసు..!

హైదరాబాద్: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కత్తిపై మరో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడిన కత్తి మహేష్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ టివి ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ హిందువుల ఆరాధ్య దైవం […]

హైదరాబాద్: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కత్తిపై మరో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడిన కత్తి మహేష్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ టివి ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ హిందువుల ఆరాధ్య దైవం రాముడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినట్లు యూసుఫ్‌గూడ పరిధిలోని రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్నారు పోలీసులు. అనంతరం కత్తి మహేష్‌పై ఐపిసి 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తాను ఇకపై విజయవాడలోనే నివాసముంటున్నట్లు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కత్తి స్పష్టం చేశాడు. తనది ఆంధ్రప్రదేశేనని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను విజయవాడకు షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపాడు. కాగా, తనపై హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా మాత్రమే నిషేధం విధించారని, మిగతా తెలంగాణలో ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments

Related Stories: