కడెం ప్రాజెక్ట్ పై విషాదం

A man who went for fishing was killed

కడెం: పరువళ్లు తొక్కుతున్న కడెం ప్రాజెక్ట్ వద్ద గల చేపలు పట్టడానికి వెళ్ళి అక్కడ ఉన్న డివైడర్‌ను ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మియపురపు నవీన్(18) రోజులాగే చేపల వేట కోసం భైక్ పై కడెం ప్రాజెక్ట్‌కు వెళ్లాడు. ప్రాజెక్ట్ పై ఉన్న డివైడర్‌ను ఢీ కొని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పోస్టమార్ట్ నిమిత్తం ఖానాపూర్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ముజాయిద్ తెలిపారు.