కడుపుబ్బ నవ్వించే ‘సిల్లీ ఫెలోస్’

అల్లరి నరేష్, సునీల్, పూర్ణ, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ “సుడిగాడు చిత్రం తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నేను చేసిన చిత్రమిది. మా కాంబినేషన్‌లో మరోసారి […]

అల్లరి నరేష్, సునీల్, పూర్ణ, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ “సుడిగాడు చిత్రం తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నేను చేసిన చిత్రమిది. మా కాంబినేషన్‌లో మరోసారి ఈ చిత్రంతో విజయం సాధిస్తామన్న నమ్మకముంది. నేను, సునీల్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్లు ఇద్దరూ బాగా నటించారు”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ “భీమనేని శ్రీనివాసరావుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అల్లరి నరేష్‌తో కలిసి ఎంతో సరదాగా ఈ సినిమాను పూర్తిచేశాం. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది”అని తెలిపారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ “స్క్రిప్ట్‌పై సంవత్సరం కష్టపడిన తర్వాత షూటింగ్ చేసిన సినిమా ఇది. ‘సుడిగాడు’ తర్వాత నరేష్‌తో చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది”అని పేర్కొన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ “భీమనేని శ్రీనివాసరావుతో 26 సంవత్సరాల అనుబంధం ఉంది. ఏదై నా సరే చాలా పర్‌ఫెక్ట్‌గా చేయాలనే కొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు. ఈ సినిమాలో ఎవరికి వారు తమ స్టయిల్లో నవ్వించారు”అని చెప్పారు. భరత్ చౌదరి మాట్లాడుతూ “రెండు గంటల పాటు నవ్వుల్లో ముంచెత్తే సినిమా ఇది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం”అని అన్నా రు. ఈ కార్యక్రమంలో వివేక్ కూచిబొట్ల, నందిని, పూర్ణ, శ్రీవసంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: