కట్నం వేదింపులకు కోడలు నిరసన

వీణవంక. వీణవంక మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో తనను అత్తింటివారు అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తనకు రక్షణ కావాలని కోరుతూ దాసారపు లావణ్య అనే వివాహిత అత్తగారింటి వద్ద నిరసన చేపట్టింది. జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల శివపార్వతి, మల్లిఖార్జున్ ల కూతురును, వీణవంక గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణస్వామికి ఇచ్చి కట్న కానుకలు ఇతర లాంచనాలతో వివాహం చేశారు. అనంతరం కొంత కాలానికి తన భర్త ప్రవర్తనలో మార్పు రావడం […]

వీణవంక. వీణవంక మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో తనను అత్తింటివారు అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తనకు రక్షణ కావాలని కోరుతూ దాసారపు లావణ్య అనే వివాహిత అత్తగారింటి వద్ద నిరసన చేపట్టింది. జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల శివపార్వతి, మల్లిఖార్జున్ ల కూతురును, వీణవంక గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణస్వామికి ఇచ్చి కట్న కానుకలు ఇతర లాంచనాలతో వివాహం చేశారు. అనంతరం కొంత కాలానికి తన భర్త ప్రవర్తనలో మార్పు రావడం అనుమానంగా వేదించడం, ప్రతి చిన్న విషయానికి కట్నం తేవాలంటూ తీవ్రంగా హింస పెడుతూ నానా రకాలుగా దుర్భాశలాడుతున్నాడని బాధితురాలు వివరించింది. తనకు భర్త వారి కుటుంబ సభ్యుల నుండి ప్రాణ భయంగా ఉందని రక్షణతో పాటు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. తనకు జరిగిన అన్యాయం గురించి పలుమార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరుగకపోవడంతో తాను మహిళా సంఘాలతో కలిసి ఇలా నిరసనకు దిగడం జరిగిందని అన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని లావణ్య తెలిపింది.

Related Stories: