కంగన హైజాక్ చేసింది

Major portions of Kangana Ranaut film to be reshot
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పుడు తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా ఫీలయ్యారు. మన దర్శకుడు ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండటంతో తెలుగువారికి ఆనందం కలిగింది. కానీ దర్శకుల పనిలో బాగా జోక్యం చేసుకుంటుందని పేరున్న కంగనతో క్రిష్ ఎలా వేగుతాడో అనే సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. చివరికి ఆ అనుమానాలే నిజమయ్యాయి. కంగనతో వేగలేక క్రిష్ ఈ చిత్రం చివరి దశలో బయటికి వచ్చేసిన విషయం అధికారికంగానే తెలిసిపోయింది. ఈ చిత్రంలో మిగిలిన సన్నివేశాల్ని ఇప్పుడు స్వయంగా కంగనానే డైరెక్ట్ చేసుకుంటోంది. క్రిష్‌లాంటి విలక్షణ దర్శకుడితో కంగన, నిర్మాతలు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలీవుడ్ జనాలు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. క్రిష్‌ను అవమానించారని… కంగన ఈ ప్రాజెక్టును హైజాక్ చేసిందని విమర్శిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలు అలాందేమీ లేదనేశారు. క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం వెళ్లడంతోనే కంగన దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందని వారు పేర్కొన్నారు.

Comments

comments