ఔషదాల పంపణిలో తెలంగాణ రాష్ట్రం ముందంజ

మేడ్చల్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఫార్మ కంపనీల నుంచి ఔషదాలను పంపణి చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్, ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పరిధిలోని జినోమ్‌వ్యాలీలో జెన్సిస్ బయోలాజిక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఫార్మ కంపనీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసియా ఖండంలోనే అధిక ఫార్మ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. హైదారాబాద్ నగరానికి సమీపంలోని జినోమ్‌వ్యాలీ(పారిశ్రామిక వాడ)లో ఫార్మ […]


మేడ్చల్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఫార్మ కంపనీల నుంచి ఔషదాలను పంపణి చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్, ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పరిధిలోని జినోమ్‌వ్యాలీలో జెన్సిస్ బయోలాజిక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఫార్మ కంపనీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసియా ఖండంలోనే అధిక ఫార్మ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. హైదారాబాద్ నగరానికి సమీపంలోని జినోమ్‌వ్యాలీ(పారిశ్రామిక వాడ)లో ఫార్మ కంపనీల అనుకూల పరిస్థితితులు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. గత నాలుగేళ్లలోనే తెలంగాణలో ఎన్నో ఫార్మ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ఇక్కడి పరిశ్రమలు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ మందికి ఔషదాలను అందజేస్తున్నాయన్నారు. ఆధాయం కోసం కాకుండా నాణ్యతమైన మందులను తయారు చేయాలని ప్రైవేటు పరిశ్రమ యాజమన్యాలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెన్సీస్ బయోలాజీక్స్ కంపనీ చైర్మన్ రాజేందర్‌రావు, ఎండి వెంకట్‌రెడ్డి, డైరక్టర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: