ఓ మహిళ బార్‌లోకి చొరబడి రాత్రంతా ఏం చేసిందో తెలుసా..?

  ఓ మహిళ బార్ లోకి రహస్యంగా చొరబడి రాత్రంతా మందు తాగుతూ.. ఎంజాయ్ చేసిన సంఘటన అమోరికాలోని కెంటుకీ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్ లో డొన్న మార్టిన్ అనే మహిళ ఓ బార్ లో రహస్యంగా దూరి ఎవరికి కనిపించకుండా ఓ మూలన కూర్చుంది. బార్ క్లోజింగ్ టైమ్ లో సిబ్బంది బార్ ను శుభ్రం చేసుకొని ఇండ్లకు బయలుదేరారు. దీంతో మహిళ సిబ్బంది అంతా వెళ్లిపోయిన తరువాత […] The post ఓ మహిళ బార్‌లోకి చొరబడి రాత్రంతా ఏం చేసిందో తెలుసా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓ మహిళ బార్ లోకి రహస్యంగా చొరబడి రాత్రంతా మందు తాగుతూ.. ఎంజాయ్ చేసిన సంఘటన అమోరికాలోని కెంటుకీ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్ లో డొన్న మార్టిన్ అనే మహిళ ఓ బార్ లో రహస్యంగా దూరి ఎవరికి కనిపించకుండా ఓ మూలన కూర్చుంది. బార్ క్లోజింగ్ టైమ్ లో సిబ్బంది బార్ ను శుభ్రం చేసుకొని ఇండ్లకు బయలుదేరారు. దీంతో మహిళ సిబ్బంది అంతా వెళ్లిపోయిన తరువాత నెమ్మదిగా బయటికి వచ్చి ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అనే తేడా లేకుండా మందు కొడుతూ రాత్రంతా డీజే పెట్టుకొని బార్ మొత్తం ఓ ఆట స్థలంగా మార్చేసింది. అనంతరం తను డ్యాన్స్ ఆడి, ఆడి అలసిపోయిన తరువాత బార్ లోనే ఓ టేబుల్ పై మధ్యం మత్తులో నిద్రపోయింది. తెల్లవారుజామున సిబ్బంది బార్ ఓపెన్ చేసి చూడగా మహిళ బార్లో ఉండడం చూసి సిబ్బంది అంతా ఖంగు తిన్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలికి చేరుకొని ఆ యువతిని అరెస్టు చేసిన్నట్టు పోలీసులు తెలియజేశారు.

women stayed in bar overnight drink alcohol

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓ మహిళ బార్‌లోకి చొరబడి రాత్రంతా ఏం చేసిందో తెలుసా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: