ఓరియంటల్ లో భారీ వృక్షాలు నరికివేత

Tree

కాసిపేట: ఒక వైపు ప్రభుత్వం హరితహారం పేరిట కోట్లా ది రూపాయలు ఖర్చు చేస్తు పర్యావరణాన్ని కాపాడుతుండగా, కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో భారీ వృక్షాలను నరికి వేస్తుండడం పట్ల ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఓరియంట్ సిమెంట్ గేటుకు ముందు సమీపంలో ఒక ప్రక్కన వున్న భారీ వృక్షాలను యాజమన్యాం నరికివేస్తుడడంతో పలువురు అడ్డుకొని సంబందిత ఫారెస్టు శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఫారె స్టు అధికారులు చెట్ల నరికి వేతను అడ్డుకున్నారు. ఇప్పటికే సిమెంట్ కం పెనీలో దుమ్ము దూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇ క్కడ చెట్లు నరకడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి సంవ త్సరం కంపెనీ మొక్కల పెంపకం చేస్తున్నట్లు ప్రకటిస్తున్న కంపెనీ ఏపుగా పెరిగిన చెట్లను మాత్రం కూల్చి వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.