ఓపెనర్ల దూకుడు..!

Rohith-Sharma

బర్మింగ్ హామ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయది పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఓపెనర్లు నిలకడగా ఆట ప్రారంభించారు. 9.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. మ్యాచ్ తిరగి ప్రారంభమైన తర్వాత ఓపెన్లరు ధావన్, రోహిత్ చెలరేగిపోయారు. బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ 85 బంతుల్లో 66 పరుగులు, శిఖర్ ధావన్ 65 బంతుల్లో 68 పరుగులు చేసి తొలి వికెట్ కు 136 భాగస్వామ్యాన్ని జత చేశారు. కాగా షాదబ్ ఖాన్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత్ 28 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 157 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ 14, రోహిత్ శర్మ 74 ఉన్నారు.

Comments

comments