ఒప్పో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల!

ముంబయి : ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ సంస్థ ఒప్పో తక్కువ బడ్జెట్ లోనే రెండు వేరియంట్ లతో హైఎండ్ ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్ ‘రియల్ మీ 2’ను మంగళవారం ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ సిరీస్ లో గతంలో ‘రియల్ మీ 1’ రిలీజ్ చేయగా తాజాగా 20% అధిక బ్యాటరీ కెపాసిటీ, అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ వంటి పలు ఆకట్టుకునే ఫీచర్లతో ‘రియల్ మీ 2’ని మార్కెట్ లోకి రిలీజ్ […]

ముంబయి : ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ సంస్థ ఒప్పో తక్కువ బడ్జెట్ లోనే రెండు వేరియంట్ లతో హైఎండ్ ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్ ‘రియల్ మీ 2’ను మంగళవారం ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ సిరీస్ లో గతంలో ‘రియల్ మీ 1’ రిలీజ్ చేయగా తాజాగా 20% అధిక బ్యాటరీ కెపాసిటీ, అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ వంటి పలు ఆకట్టుకునే ఫీచర్లతో ‘రియల్ మీ 2’ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డైమండ్ రెడ్, బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్స్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు…

3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,990. అలాగే 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.10990గా పిక్స్  చేసారు. వెనక భాగంలో రెండు 13/2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సేల్ఫీ కెమెరాలతో పాటు 6 ఇంచస్ స్క్రీన్, 4230ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వాడటం వల్ల ఇతర స్మార్ట్ ఫోన్ల కన్నా బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ సమయం ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్ ని కొనే వినియోగదారులు హెచ్ డిఎఫ్ సి బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుని ఉపయోగించి రూ.750 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చును. జియో వినియోగదారులకి 120జిబి అదనపు డేటా, రూ.2200 విలువ గల క్యాష్ బ్యాక్ కూడా వోచర్ల రూపంలో వినియోగదారులకు లభిస్తాయి. సెప్టెంబర్ 4 నుంచి ఫ్లిప్ కార్ట్ సైట్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.