ఒడిదుడుకులుంటాయి జాగ్రత్త!

అంతర్జాతీయ అంశాలు, రుతుపవనాలు కీలకం ఈ వారంలోనే డెరివేటివ్స్ గడువు, స్థూల గణాంకాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న విశ్లేషకులు న్యూఢిల్లీ: ఈవారం స్టాక్‌మార్కెట్‌ను అంతర్జాతీయ పరిణామాలు, స్థూల గణాంకాలు, వర్షపాతం వంటి అంశాలు శాసించనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలు, దిగుమతి సుంకాలపై తదుపరి పరిణామాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అలాగే స్వల్పంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచాలంటూ ఒపెక్ సమావేశంలో దేశాలు నిర్ణయించడం, దేశీయంగా రుతుపవనాలు, స్థూల ఆర్థిక గణాంకాలను […]

అంతర్జాతీయ అంశాలు, రుతుపవనాలు కీలకం
ఈ వారంలోనే డెరివేటివ్స్ గడువు, స్థూల గణాంకాలు
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ: ఈవారం స్టాక్‌మార్కెట్‌ను అంతర్జాతీయ పరిణామాలు, స్థూల గణాంకాలు, వర్షపాతం వంటి అంశాలు శాసించనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలు, దిగుమతి సుంకాలపై తదుపరి పరిణామాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అలాగే స్వల్పంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచాలంటూ ఒపెక్ సమావేశంలో దేశాలు నిర్ణయించడం, దేశీయంగా రుతుపవనాలు, స్థూల ఆర్థిక గణాంకాలను గమనించాలని చెబుతున్నారు. మార్కెట్‌పై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ స్పందించారు. రుతుపవనాల్లో పురోగతి, గ్రామీణ మార్కెట్‌పై సానుకూలతలు ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించనున్నాయని, ఇప్పటికే మెరుగుపడిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ వారంలో వినిమయ ధరల సూచీ, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, డబ్లుపిఐ(టోకు ధర సూచీ) ఆధారిత గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలను ఇన్వెస్టర్లు పరిశీలించాలని, ఇవి కూడా మార్కెట్లకు ఎంతో కీలకమని అన్నారు. వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటం, మరోపక్క ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు తేదీ వంటి అంశాల కారణంగా వచ్చే వారం కూడా మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
వర్షపాతంపై దృష్టి
మార్కెట్లకు వర్షాలు చాలా కీలకంగా మారాయి. అంచనాలకు అనుగుణంగా నైరుతీ రుతుపవనాలు కేరళను తాకాయి.. అయితే దేశమంతటా విస్తరించడంలో కొంతమేర ఆలస్యంకావడం ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ 1-20 నాటికి వర్షపాతం దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 7 శాతం తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. దేశీయంగా అత్యధిక శాతం వ్యవసాయం వర్షాధారం కావడంతో నైరుతీ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వర్షాలు ఆశించిన మేరకు ఉంటే మార్కెట్లకు సానుకూలం కానుంది.
ఎఫ్ అండ్ ఒ గడువు
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఒ) గడువు జూన్ 28 కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండనున్నారు. డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో జాగ్రత్త వహించాలని ఇన్వెస్టర్లు సూచిస్తున్నారు. ఇంకా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ ప్రాధాన్యత ఉంది. దేశీ స్టాక్స్‌లో ఇటీవల కొంతకాలంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్(డిఐఐలు) ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఎఫ్‌పిఐలు, డిఐఐల పెట్టుబడుల పరిణామాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
గతవారం అస్థిరత
ట్రేడ్ వార్ నేపథ్యంలో గత వారం ప్రపంచ మార్కెట్లను అస్థిరతకు గురయ్యాయి. స్టాక్‌మార్కెట్ సూచీలు పలుమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. శుక్రవారం(22)తో ముగిసిన వారం సెన్సెక్స్ 67పాయింట్ల స్వల్ప లాభంతో 35,690 వద్ద నిలిచింది. నిఫ్టీ అయితే 4 పాయింట్లు మాత్రమే పెరిగి 10,822 వద్ద స్థిరపడింది. మార్కెట్ల ఊగిసలాట మధ్య గడిచిన వారం చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ సూచీ 1 శాతంపైగా బలహీనపడింది. ఇక స్మాల్ క్యాప్ మరింత అధికంగా 2.5 శాతం పతనమైంది.

Comments

comments

Related Stories: