ఒక శాతం ఎక్కువ చేస్తా: పవన్

పశ్చిమగోదావరి: హామీలు అమలు చేయడానికి సిఎం చంద్రబాబు కు మనసు రావడం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్  ఆరోపించారు. భీమవరంలో అసంఘటిత కార్మికులతో సమావేశమైన సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు జీవోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.  సినిమాల్లో లాగా రెండున్నర గంటల్లో రాజకీయాల్లో మార్పు సాధ్యం కాదని పవన్‌కల్యాణ్ అన్నారు. తానైతే ఇచ్చిన హామీ కంటే ఒక శాతం ఎక్కువే చేస్తానని, తమ పార్టీకి ఓట్లు వేయమని అడగను అని ఆయన అన్నారు. నమ్మకం ఉంటే […]

పశ్చిమగోదావరి: హామీలు అమలు చేయడానికి సిఎం చంద్రబాబు కు మనసు రావడం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్  ఆరోపించారు. భీమవరంలో అసంఘటిత కార్మికులతో సమావేశమైన సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు జీవోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.  సినిమాల్లో లాగా రెండున్నర గంటల్లో రాజకీయాల్లో మార్పు సాధ్యం కాదని పవన్‌కల్యాణ్ అన్నారు. తానైతే ఇచ్చిన హామీ కంటే ఒక శాతం ఎక్కువే చేస్తానని, తమ పార్టీకి ఓట్లు వేయమని అడగను అని ఆయన అన్నారు. నమ్మకం ఉంటే మీరే ఓటు వేస్తారని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Comments

comments