ఒక్క పోస్ట్‌తో సెలబ్రిటీ అయ్యింది

ఒక్క వీడియో గంగమ్మ జీవితాన్ని మార్చేసింది. పాటనే నమ్ముకుని… పాటనే ప్రాణంగా భావిస్తున్న ఈమె నేటి యువతకు స్ఫూర్తి. ఫేస్‌బుక్ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాగే గంగమ్మకూడా వెలుగులోకి వచ్చింది. ఆమె పాడిన ఒక పాటను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తే 6 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకే ఈమె ఈ తరానికి స్ఫూర్తిదాయకం. గంగమ్మ జీవితంలో పడ్డ కష్టాలు, ఆమె కుటుంబ పరిస్థితి, […]

ఒక్క వీడియో గంగమ్మ జీవితాన్ని మార్చేసింది. పాటనే నమ్ముకుని… పాటనే ప్రాణంగా భావిస్తున్న ఈమె నేటి యువతకు స్ఫూర్తి. ఫేస్‌బుక్ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాగే గంగమ్మకూడా వెలుగులోకి వచ్చింది. ఆమె పాడిన ఒక పాటను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తే 6 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకే ఈమె ఈ తరానికి స్ఫూర్తిదాయకం. గంగమ్మ జీవితంలో పడ్డ కష్టాలు, ఆమె కుటుంబ పరిస్థితి, ఎలా తన లైఫ్ టర్న్ అయ్యింది, ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ ఇలా అన్నీ బోల్ స్కై కి ప్రత్యేకంగా వివరించింది. గంగమ్మది కర్ణాటకలో ఒక మారుమూల గ్రామం కొప్పల్. చిన్నతనం నుంచే  పాటలంటే ప్రాణం.  కన్నడతో పాటు హిందీ, తెలుగు పాటలు ఆమె మధురంగా పాడుతుంది. హిందీ, తెలుగు పాటలు మొత్తం కూడా కన్నడ భాషలో రాసుకుంటూ పాడుతోంది.ఇప్పుడు ఆమె పాటే ఆ కుటుంబానికి ఆసరా అయ్యింది.    ఒకసారి ప్రముఖ సింగర్ జానకమ్మ గంగమ్మ పాటను విన్నారట. ‘జానకిని నేను కాదమ్మా.. నిజమైన జానకివి నువ్వేనమ్మా‘ అని ప్రశంసించారట.  జానకి అంటే గంగమ్మకు కూడా చిన్నప్పటి నుంచి ప్రేరణ. ఎప్పటికైనా ఆమెకు అంతకాకున్నా తను కూడా జానకిలా పేరు తెచ్చుకోవాలని కలలు కనేది గంగమ్మ. ఆ కల నిజం చేసుకుంది. ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గంగమ్మకు పాడేందుకు ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గంగమ్మ పాడిన పాటల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Related Stories: