ఒకేసారి మూడు భాషల్లో నాగార్జున

మొన్నటివరకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యతనిచ్చాడు సీనియర్ స్టార్ హీరో నాగార్జున. అయితే చాలా కాలం తర్వాత అతను ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు నాగార్జున. త్వరలోనే అతను ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈవిధంగా ఒకేసారి మూడు భాషలను కవర్ చేస్తున్నాడు ఈ సీనియర్ స్టార్. ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగార్జున. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ నెలాఖరు నుంచి ఈ […]

మొన్నటివరకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యతనిచ్చాడు సీనియర్ స్టార్ హీరో నాగార్జున. అయితే చాలా కాలం తర్వాత అతను ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు నాగార్జున. త్వరలోనే అతను ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈవిధంగా ఒకేసారి మూడు భాషలను కవర్ చేస్తున్నాడు ఈ సీనియర్ స్టార్. ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగార్జున. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు నాగార్జున. ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ చేస్తున్న నాగ్ బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ధనుష్ సినిమాలో నటించబోతున్నాడు. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జునతో పాటు శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, శరత్‌కుమార్ కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారు. అదితిరావు హైదరీ, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో తాను దాదాపు 20 నిమిషాలు కనిపిస్తానని… తన గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందని నాగార్జున తెలియజేశాడు.

Related Stories: