ఒంటికి నిప్పంటించుకున్న ఓదేలు అనుచరుడు

Accident

మంచిర్యాల: చెన్నూరు నియోజక వర్గం ఇందారంలో నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకున్నాడు. బాల్క సుమన్ ప్రచారాన్ని గట్టయ్య అడ్డుకొని నిప్పంటించుకున్నాడు. టిఆర్‌ఎస్ కార్యకర్త గట్టయ్య నిప్పంటించుకోవడంతో మంటలు మరో నలుగురికి అంటుకున్నాయి. ఇందారంలో బాల్క సుమన్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు గట్టయ్యతో పాటు నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఎంఎల్ఎ నల్లాల ఓదేలు బదులు బాల్క సుమన్ కు ఇచ్చిన విషయం తెలిసిందే.

Comments

comments