ఐష్ స్థానంలో తాప్సీ

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌కు బ్యాడ్ టైమ్ నడు స్తోం దా? అంటే అవునని తాజా సంఘటన చెబుతోంది. తాజాగా ఓ అవకాశం ఐష్‌కు వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తు తం దీనిపై బాలీవుడ్‌లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఐశ్వర్యారాయ్ నటించిన జజ్బా, ఫనేఖాన్ చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. దాంతో ఆమె క్రేజ్ ఆటేమేటిక్‌గా తగ్గిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. అందుకు తగ్గట్టే దర్శకనిర్మాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఐశ్వర్యారాయ్‌ను ఎం పిక చేసుకునేముందు ఆలోచిస్తున్నారట. తాజాగా ఐశ్వర్యారాయ్ […]

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌కు బ్యాడ్ టైమ్ నడు స్తోం దా? అంటే అవునని తాజా సంఘటన చెబుతోంది. తాజాగా ఓ అవకాశం ఐష్‌కు వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తు తం దీనిపై బాలీవుడ్‌లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఐశ్వర్యారాయ్ నటించిన జజ్బా, ఫనేఖాన్ చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. దాంతో ఆమె క్రేజ్ ఆటేమేటిక్‌గా తగ్గిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. అందుకు తగ్గట్టే దర్శకనిర్మాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఐశ్వర్యారాయ్‌ను ఎం పిక చేసుకునేముందు ఆలోచిస్తున్నారట. తాజాగా ఐశ్వర్యారాయ్ ఓ క్రేజ్ ఆఫర్‌ను కోల్పోయింది. ఆమె స్థానంలో తాప్సీని కథానాయికగా ఎంపిక చేయడం హాట్ టాపిక్ అయింది. శైలేష్ ఆర్.సింగ్ దర్శకత్వం వహిస్తున్న పోలీస్ స్టోరీ డ్రామాలో అభిషేక్ బచ్చన్ సరసన తాప్సీ కథానాయికగా ఎంపికైంది. చివరి నిమిషంలో దర్శకుడు ఐష్‌ను మార్చడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో తాప్సీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనుందని తెలిసింది. పింక్, నామ్ షబనా, ముల్క్ చిత్రాలతో విమర్శ కుల ప్రశంసలను పొందిన తాప్సీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.

Related Stories: