ఐదో టెస్ట్‌లో దర్శనమిచ్చిన మాల్యా

Vijay Mallya appeared in fifth Test
లండన్: దేశీయ బ్యాంకులకు 9 వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్క‌ర్‌ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో మకాం వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఉంటూ తన వ్యాపార వ్యవహారాలను నడిపిస్తున్నాడు. కాగా, తాజాగా లండన్‌లోని ది ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో విజయ్ మాల్యా దర్శనమిచ్చాడు. ఈ మ్యాచ్‌ను మాల్యా వీక్షించడానికి వస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. కీటన్ జెన్నింగ్స్(23) వికెట్‌ని త్వరగా కోల్పోయినప్పటికీ… కుక్, అలీలు జట్టుకు అండగా నిలబడ్డారు. మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి 59 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 123 పరుగులు చేశారు. ఈ క్రమంలో కుక్(66) అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు సభ్యులను కలిసేందుకు విజయ్ మాల్యా ప్రయత్నించినట్టు, అందుకు భారత సర్కార్ అంగీకరించలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.