ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మాహత్యయత్నం..

 Student suicide Attempted in Hostel In nalgonda District

Student suicide Attempted in Hostel In nalgonda District

నల్లగొండ: గిరిజన విద్యార్థి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఎల్లాపురం తండాకు చెందిన ధనావత్ రంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం( ఎంపిసి) చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరిగి హాస్టల్‌కు వచ్చాడు.  త్వరలో తన బర్త్‌డే ఉన్నదని, ఘనంగా వేడుకలు జరుపుకుందామని స్నేహితులతో చెబుతూనే తన వద్ద పశువుల మందు తాగిన వాసన రావడం లేదా? అని అడిగాడు. అతడి ప్రవర్తన పై అనుమానం వచ్చిన స్నేహితులు హాస్టల్ రూమ్‌లోకి వెళ్లి అతడు తాగిన పశువుల మందు డబ్బాను గమనించి, వెంటనే రంగా తల్లి, అక్కకు ఫోన్ చేశారు.

స్నేహితులో ఇంటి దగ్గర గొడవ పెట్టుకుని వచ్చాడని తల్లి మాట్లాడుతుండగా, రంగా హఠాత్తుగా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. కిందకు పడే క్రమంలో మధ్యలో విద్యుత్ సర్వీసు వైర్ల పై పడి కింద పడ్డాడు. దీంతో రంగా చెయి విరిగింది. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిండంతో  మెరుగైన వైద్యం కోసం జిల్లా అధికారులు నార్కట్‌పల్లి కామినేని ఆసునత్రి కి  తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రంగా ని నార్కట్‌పల్లి కామినేని ఆసునత్రి కి తరలించగా అక్కడి వైద్యులు  మందును కక్కించారు. చేతికి మాత్రమే ప్యాక్చర్ అయినట్లు గుర్తించి ప్రాణపాయం లేనట్లు  వైద్యులు చెప్పినట్టు సమాచారం.