“ఐక్యమత్యంతో ఉండి దేశాన్ని రక్షించుకోవాలి”

Fuel-Price-Hike

న్యూఢిల్లీ:  మోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ప్రజా పాలనలో ఎన్డిఎ విఫలమైందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు ఢిల్లీలో ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసి అక్రమంగా పరిమితులును అక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ప్రజలకు అవసరమైన పనులను మోడీ ప్రభుత్వం చేపట్టలేకపోయిందని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవడంతో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పత్రిపక్షాలు ఐక్యమత్యంతో ఉండి శాంతియుతంగా దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం కాపాడేందుకు అందరం ఏకతాటిపైకి రావాలని ప్రతిపక్షాలను కోరారు.