ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్: 16 ఏళ్ల హృదయ్ కు గోల్డ్

Hriday Hazarika Clinches Gold at ISSF World Championships

చాంగ్వాన్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ చాంపియన్ షిప్ లో జూనియర్ మెన్స్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 16 ఏళ్ల హృదయ్ హజారికా స్వర్ణం గెలిచాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హజారికా, ఇరాన్ షూటర్ అమీర్ 250.1 సమాన పాయింట్లు సాధించారు. దీంతో ఫైనల్ కాస్త షూట్-ఆఫ్‌కు దారితీసింది. థ్రిల్లింగ్ షూట్-ఆఫ్‌లో ఇద్దరు హోరాహోరీగా పోటీపడగా 0.1 తేడాతో హజారికా గోల్డ్ సాధించాడు. 10.3 పాయింట్స్‌తో హృదయ్ స్వర్ణం సాధించగా, అమీర్ 10.2 పాయింట్స్‌తో రజతానికే పరిమితమయ్యాడు. రష్యా షూటర్ గ్రిగోరీ షమాకోవ్ కాంస్యం గెలిచాడు. హృదయ్ స్వర్ణం సాధించడంతో కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. గోల్డెన్ షాట్ అంటూ హృదయ్ హజారికాను అభినందించాడు.

Comments

comments