ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్ల నియామకం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సహా 7 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త గవర్నర్లను నియమించింది. జమ్మూకశ్మీర్ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌ను నియమించింది. గతంలో ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే, బీహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ నియమించబడ్డారు. సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకిలను కేంద్రం ప్రభుత్వం నియమించింది. హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్యను నియమిస్తూ […]

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సహా 7 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త గవర్నర్లను నియమించింది. జమ్మూకశ్మీర్ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌ను నియమించింది. గతంలో ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే, బీహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ నియమించబడ్డారు. సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకిలను కేంద్రం ప్రభుత్వం నియమించింది. హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్యను నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Stories: